Telugu Global
NEWS

శ్రీలంకలో డబ్బులు పంచిన తెలంగాణ వాసి.. ఆ తర్వాత అసలు ట్విస్ట్

శ్రీలంకలో గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో ఇండియా వద్ద సాయం అడిగి చమురు, మెడిసిన్స్, ఇతర నిత్యవసరాలు కొనుగోలు చేస్తోంది. ఇండియా కూడా పక్క దేశానికి ఉదారంగా సాయం చేస్తోంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు రోడ్లపైకి ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వాసి చేసిన పనికి అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక నెల […]

Ravinder-reddy-Telangana-Srilanka
X

శ్రీలంకలో గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వద్ద విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడంతో ఇండియా వద్ద సాయం అడిగి చమురు, మెడిసిన్స్, ఇతర నిత్యవసరాలు కొనుగోలు చేస్తోంది. ఇండియా కూడా పక్క దేశానికి ఉదారంగా సాయం చేస్తోంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు రోడ్లపైకి ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వాసి చేసిన పనికి అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఒక నెల క్రితం నిజామాబాద్‌కు చెందిన రవీందర్ రెడ్డి శ్రీలంక వెళ్లారు. అక్కడ ప్రజల ఇబ్బందులు చూసి.. రూ. 5 లక్షల కరెన్సీతో పాటు ఆహారాన్ని పంచారు. శ్రీలంక కరెన్సీలోని రూ. 500, రూ. 1000 నోట్లను రోడ్ల వెంబడి ఇబ్బందుల్లో ఉన్న వారికి అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న శ్రీలంక సీఐడీ పోలీసులు అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అసలు డబ్బు ఎందుకు పంచుతున్నావని అతడిని ప్రశ్నల్లో ముంచెత్తారు. అయితే విషయం తెలుసుకున్న ఇండియన్ ఎంబసీ అధికారులు రవీందర్ రెడ్డిని విడిపించారు. ఈ ఘటనపై రవీందర్ రెడ్డి మాట్లాడారు.

‘శ్రీలంకకు తాను వ్యాపార పనుల కొరకు రెగ్యులర్‌గా వెళ్తుంటాను. వెళ్లినప్పుడల్లా 9 నుంచి 20 రోజుల వరకు ఉంటాను. ఈ క్రమంలో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడం నన్ను బాధించింది. కొలంబోలో అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నేను కూడా పాల్గొన్నాను. ఆ సమయంలోనే రెండు మూడు రోజుల పాటు ఆహారంతో పాటు డబ్బులు కూడా పంచిపెట్టాను. అక్కడ ప్రజల ఇబ్బందులు కాస్తైనా తీర్చాలనే అలా చేశాను’ అని ఆయన చెప్పారు.

ఆ సమయంలో తన దగ్గర రూ. 5 లక్షల శ్రీలంక కరెన్సీ ఉండటంతో అంత మేరకు పంచిపెట్టాను. అయితే ఆందోళనలపై నిఘా పెట్టిన శ్రీలంక పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు కూడా పోలీసులు సాక్ష్యంగా చూపించారు. అయితే తాను కేవలం వ్యాపారం కోసం వచ్చి.. ప్రజల కష్టాలు చూసి మాత్రమే డబ్బు పంచినట్లు వెల్లడించారు. తాను రెగ్యులర్‌గా శ్రీలంకకు వస్తుంటాననే ప్రూఫ్స్ కూడా చూపించాను. ఆ సమయంలో సీఐడీ పోలీసులు ఆ ఫొటోలు, వీడియోలు తన కొడుకుకు పంపించారు. చివరకు ఎంబసీ జోక్యంతో తనను విడిచిపెట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకొని తనపై ఎలాంటి కఠిన చర్యలకు, దాడికి పాల్పడలేదు అని రవీందర్ చెప్పుకొచ్చారు.

దాదాపు 6 గంటల పాటు సీఐడీ పోలీసుల అదుపులో ఉన్న తర్వాత.. రవీందర్ కొడుకు చేత అతనికి కొలంబో నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించారు. అనంతరం అతడిని విడిచిపెట్టడంతో క్షేమంగా ఇండియాకు చేరుకున్నాడు. శ్రీలంక పోలీస్ అధికార ప్రతినిధి ఎస్ఎస్‌పీ తల్దువా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రవీందర్ రెడ్డిని అరెస్టు చేయలేదని, కేవలం అతడి స్టేట్ మెంట్ మాత్రమే రికార్డు చేశామని ఆయన చెప్పారు.

First Published:  14 Jun 2022 4:11 AM GMT
Next Story