Telugu Global
MOVIE UPDATES

జైలర్ అవతారమెత్తనున్న రజినీకాంత్..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. రోబో సినిమా సూపర్ హిట్ తర్వాత ఆ స్థాయి విజయం ఆయనకు మళ్లీ దక్కలేదు. కొచ్చాడయాన్, లింగా, కబాలి, కాలా, రోబో 2.0, పేట, దర్బార్, అన్నాత్తే సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. పేట, దర్బార్ సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద నిలవలేకపోయాయి. దీంతో కొద్ది రోజులుగా రజినీ మరో సినిమా ఒప్పుకోలేదు. తాజాగా ఆయన బీస్ట్ సినిమా ఫేమ్ నెల్సన్ […]

Rajinikanth
X

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. రోబో సినిమా సూపర్ హిట్ తర్వాత ఆ స్థాయి విజయం ఆయనకు మళ్లీ దక్కలేదు. కొచ్చాడయాన్, లింగా, కబాలి, కాలా, రోబో 2.0, పేట, దర్బార్, అన్నాత్తే సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. పేట, దర్బార్ సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద నిలవలేకపోయాయి. దీంతో కొద్ది రోజులుగా రజినీ మరో సినిమా ఒప్పుకోలేదు. తాజాగా ఆయన బీస్ట్ సినిమా ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారు.

విజయ్ తో నెల్సన్ చేసిన బీస్ట్ సినిమా ప్లాప్ కావడంతో రజినీకాంత్ తో సినిమా ఉంటుందా.. లేదా..అనే ప్రచారం జరిగింది. అయితే వారిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తాజాగా సన్ పిక్చర్స్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో రజినీకాంత్ జైలర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. జైల్లోని ఖైదీల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ కు జోడిగా నటిస్తుందని తెలుస్తోంది. అలాగే తమిళంలో మరో స్టార్ హీరో అయిన శివ కార్తికేయన్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. రజినీకాంత్ వరుస పరాజయాలకు ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

First Published:  14 Jun 2022 1:26 AM GMT
Next Story