Telugu Global
NEWS

కాంగ్రెస్ నిరసనకి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి.. ఇది కదా రాజకీయం అంటే..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో చాలాసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఆ నిరసనలు, ఆందోళనలు.. ఎప్పుడూ సజావుగా సాగలేదు. పోలీసులు అనుమతిచ్చేవారు కాదు, అనుమతిచ్చినా ఆంక్షలు పెట్టేవారు. అరెస్ట్ లు, ఆందోళనలు, రేవంత్ రెడ్డి సవాళ్లు.. ఇలా జరిగేవి కాంగ్రెస్ నిరసనలు. అయితే తొలిసారిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చారు. నెక్లెస్ రోడ్డు లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనకు […]

కాంగ్రెస్ నిరసనకి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి.. ఇది కదా రాజకీయం అంటే..
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో చాలాసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఆ నిరసనలు, ఆందోళనలు.. ఎప్పుడూ సజావుగా సాగలేదు. పోలీసులు అనుమతిచ్చేవారు కాదు, అనుమతిచ్చినా ఆంక్షలు పెట్టేవారు. అరెస్ట్ లు, ఆందోళనలు, రేవంత్ రెడ్డి సవాళ్లు.. ఇలా జరిగేవి కాంగ్రెస్ నిరసనలు. అయితే తొలిసారిగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చారు. నెక్లెస్ రోడ్డు లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అంతే కాదు, ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం మరీ విశేషం.

టార్గెట్ బీజేపీ..
వైరి వర్గాన్ని టార్గెట్ చేయడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈడీ, సీబీఐని వాడుకుంది. అప్పుడిలాంటి వ్యవహారాలను వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు తాను కూడా అదే పని చేస్తోంది. ఇంకాస్త ఎక్కువగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఈడీ సమన్లు, ఢిల్లీ ఈడీ ఆఫీస్ లో రాహుల్ హాజరు.. తదితర వ్యవహారాలను ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిర్ణయించాయి. సహజంగా ఇలాంటి కార్యక్రమాలకు తెలంగాణ పోలీసులు అనుమతిచ్చేవారు కాదు. కానీ ఇక్కడ టార్గెట్ బీజేపీ. బీజేపీ కాంగ్రెస్ కి శత్రువు, టీఆర్ఎస్ కి ఇప్పుడు ప్రధాన శత్రువు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఢిల్లీలో అరెస్ట్ లు.. హైదరాబాద్ లో నిరసనలు..
రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యే క్రమంలో ఢిల్లీలో వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు హైదరాబాద్ లో మాత్రం ర్యాలీలో ప్రముఖ నేతలంతా పాల్గొన్నారు. గతంలో ర్యాలీలంటే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు ఉండేవి. ఈసారి నిరసనలకు లైసెన్స్ వచ్చినట్టుగా పోలీసులు అనుమతివ్వడంతో కాంగ్రెస్ నేతలంతా హైదరాబాద్ రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు వెయ్యిమంది నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి రాహుల్ గాంధీ బయటకు వచ్చే వరకు ఇక్కడ హైదరాబాద్ లో శాంతియుతంగా నిరసన తెలపేందుకు టీపీసీసీ నిర్ణయించింది.

First Published:  13 Jun 2022 4:04 AM GMT
Next Story