Telugu Global
Cinema & Entertainment

సర్కారు వారి పాట లో మహేష్ కు నచ్చిన బ్లాక్

సర్కారు వారి పాట హిట్టయింది. 5 రోజులకే వంద కోట్ల షేర్ సాధించింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మహేష్ కుటుంబానికి కూడా నచ్చింది. మరి ఈ సినిమాలో మహేష్ కు నచ్చిన పార్ట్ ఏంటి? సినిమా అంతా హీరోకు నచ్చుతుంది. కానీ మనసుకు నచ్చిన పార్ట్ మాత్రం ఒకటి ఉంటుంది. అదేంటో మహేష్ బయటపెట్టాడు. సర్కారు వారి పాట సినిమాలో లవ్ ట్రాక్ మహేష్ బాబుకు బాగా నచ్చిందట. ఇప్పటివరకు చాలా సినిమాల్లో తను […]

సర్కారు వారి పాట
X

సర్కారు వారి పాట హిట్టయింది. 5 రోజులకే వంద కోట్ల షేర్ సాధించింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మహేష్ కుటుంబానికి కూడా నచ్చింది. మరి ఈ సినిమాలో మహేష్ కు నచ్చిన పార్ట్ ఏంటి? సినిమా అంతా హీరోకు నచ్చుతుంది. కానీ మనసుకు నచ్చిన పార్ట్ మాత్రం ఒకటి ఉంటుంది. అదేంటో మహేష్ బయటపెట్టాడు.

సర్కారు వారి పాట సినిమాలో లవ్ ట్రాక్ మహేష్ బాబుకు బాగా నచ్చిందట. ఇప్పటివరకు చాలా సినిమాల్లో తను లవ్ ట్రాక్స్ చేసినప్పటికీ, సర్కారువారి పాట సినిమాలో ట్రాక్ మాత్రం చాలా కొత్తగా అనిపించిందంటున్నాడు మహేష్. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తిసురేష్, మహేష్ బాబును మోసం చేస్తుంది.

ప్రేమించినట్టు నటిస్తూనే, రెండు సార్లు మహేష్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. తనను ప్రేమించడం లేదని తర్వాత తెలుసుకుంటాడు మహేష్. ఈ గ్యాప్ లో కళావతి… కళావతి అంటూ సాంగేసుకుంటాడు కూడా. ఆ తర్వాత అదే అమ్మాయి, తనను ప్రేమించేలా చేసుకుంటాడు. ఈ మొత్తం ఎపిసోడ్ తనకు బాగా నచ్చిందని ప్రకటించాడు మహేష్ బాబు.

ఓ అమ్మాయి చేతిలో హీరో మోసపోవడం అనే కాన్సెప్ట్ తనకు బాగా నచ్చిందని, అదే ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టిందని అంటున్నాడు. పరశురామ్ ఈ సినిమాను డైరక్ట్ చేశాడు.

First Published:  17 May 2022 3:42 AM GMT
Next Story