Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట మొదటి వారాంతం వసూళ్లు

మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. గురువారం రిలీజైన ఈ సినిమా, 4 రోజుల్లో ఏకంగా 95 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఓ రీజనల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఆల్ టైమ్ రికార్డ్ గా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి వారాంతం 75 కోట్ల 58 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్ లో ఈ […]

సర్కారువారి పాట మొదటి వారాంతం వసూళ్లు
X

మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. గురువారం రిలీజైన ఈ సినిమా, 4 రోజుల్లో ఏకంగా 95 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఓ రీజనల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఆల్ టైమ్ రికార్డ్ గా చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి వారాంతం 75 కోట్ల 58 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్ లో ఈ సినిమాకు వసూళ్లు వచ్చాయి. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. మహేష్ నుంచి ఓ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి వెళ్లడం ఇది నాలుగో సారి. 2 మిలియన్ డాలర్ క్లబ్ లో నాలుగేసి సినిమాలు కలిగి ఉన్న హీరోలు సౌత్ లో మహేష్ తో పాటు ప్రభాస్, రజనీకాంత్ మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లో సర్కారువారి పాట సినిమాకు ఫస్ట్ వీకెండ్ వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 29.61Cr
సీడెడ్ – 9.81Cr
ఉత్తరాంధ్ర – 9.36Cr
గుంటూరు – 7.57Cr
ఈస్ట్ – 6.51Cr
కృష్ణా – 5.4Cr
వెస్ట్ – 4.41Cr
నెల్లూరు – 2.91Cr
ఏపీ, నైజాం 4 రోజుల షేర్.. 75 కోట్ల 58 లక్షలు
ఓవర్సీస్ 4 రోజుల వసూళ్లు – 11.90 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ – 95 కోట్లు 8 లక్షలు

First Published:  16 May 2022 10:47 AM GMT
Next Story