About Us

పాఠకులకు ముఖ్యంగా తెలుగు ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉండాలన్న సత్సంకల్పంతో రూపొందించిన వెబ్‌సైటే తెలుగు గ్లోబల్‌ డాట్‌ కామ్‌. ఇందులో తెలుగు ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలతోపాటు దేశ, విదేశీ వార్తలు, రాజకీయ విశేషాలు, విశ్లేషణలు… వెండితెర, బుల్లితెర విశేషాలు మీ ముందుకు తెస్తుంది.
 
సగటు మనిషిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడే కథనాలు, మంచి సాహిత్యం, మనసారా నవ్వించే జోక్‌లు, వివిధ అంశాలపై విశ్లేషణలు, చర్చాగోష్ఠులు, మహిళలకు బాసటగా నిలిచే స్ఫూర్తిదాయక కథనాలు, పిల్లలకు ఉపయోగపడే చక్కని అంశాలు, క్రీడా, బిజినెస్‌ కథనాలు, విశ్లేషణలు మీ చెంతకు చేరుస్తుంది. అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే భక్తి కథనాలు, ప్రవాసాంధ్రుల విశేషాలు ఈ వెబ్‌సైట్‌ మీకు అందిస్తుంది.
 
రెండున్నర దశాబ్దాల అనుభవం కలిగిన జర్నలిస్టులు కొంతమంది ఈ వెబ్‌సైటు నిర్వాహకులు. వేగంగా… నిష్పక్షపాతంగా.… మానవతా విలువలు ఆధారంగా ఈ సైటు నిర్వహించాలన్న సంకల్పంతో తొలి అడుగులు వేస్తున్నారీ జర్నలిస్టులు. ఆశీర్వదించండి… ఆదరించండి…