విక్రాంత్ రోణ ట్రయిలర్.. పాన్ ఇండియా అప్పీల్

vikrant rona trailer

కిచ్చా సుదీప్ చిత్రం ‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో ట్రైల‌ర్ మెస్మ‌రైజ్ చేస్తోంది. ట్రైల‌ర్ చూస్తుంటే సినీ ప్రేమికులు ‘విక్రాంత్ రోణ’ మూవీ ఒక విజువ‌ల్ ట్రీట్ అని అర్థ‌మ‌వుతుంది.

కిచ్చా సుదీప్‌ ‘విక్రాంత్ రోణ’ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా! ఎలా ఉండ‌బోతుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రయిలర్ తోనే ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చేసింది.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. త్రీడీ విజువ‌ల్స్‌తో ఓ గ్రామం సెట్‌ను కెమెరాలో అద్భుతంగా ఆవిష్క‌రించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా భారీ షిప్‌పై కిచ్చా సుదీప్ ఎంట్రీ ఉంది. అలాగే హాట్ లుక్‌లో జాక్వ‌లైన్ అందచందాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను దోచుకుంది. ఈ ట్రైల‌ర్ ఆడియెన్స్‌కి ప‌ర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు.

ముంబయిలో ఈ ట్రయిలర్ రిలీజ్ చేశారు. ‘విక్రాంత్ రోణ’ హిందీ ట్రైల‌ర్‌ను స‌ల్మాన్ ఖాన్‌.. త‌మిళ ట్రైల‌ర్‌ను ధ‌నుష్‌.. మ‌ల‌యాళ ట్రైల‌ర్‌ను దుల్క‌ర్ స‌ల్మాన్‌.. తెలుగు ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్.. క‌న్న‌డ ట్రైల‌ర్‌ను కిచ్చా సుదీప్ విడుద‌ల చేశారు.

జూలై 28న ‘విక్రాంత్ రోణ’త్రీడీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కిచ్చా సుదీప్ న‌టించిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు.