ఫ్రీ హ్యాండ్ ఇచ్చా, ఏ పార్టీలోనైనా ఉండొచ్చు-గల్లా అరుణకుమారి

galla-aruna-kumari-sensational-remarks

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కుమారుడు టీడీపీ ఎంపీగా ఉన్నప్పటికీ రాజకీయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ భవనానికి భూమిపూజ చేసిన ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు.

తన రాజకీయ జీవితం ముగిసిందని ఆమె ప్రకటించారు. తానిప్పుడు ఏ పార్టీలో లేనని.. కేవలం ట్రస్ట్‌ పనులు మాత్రమే చూసుకుంటున్నానని వివరించారు. రాజకీయాల్లో తాను చేపట్టని పదవి లేదని, రాజకీయాల్లో చూడనిది ఏమీ లేదన్నారు. అందుకే రాజకీయాలే వద్దనుకున్నానని అందుకే సైలెంట్‌గా ఉంటున్నానని వ్యాఖ్యానించారు.

తన కుమారుడు రాజకీయాల్లో ఉన్నారని ఆయనకు అండగా మాత్రం ఉంటానన్నారు. తన అనుచరులకు కూడా స్వేచ్చనిచ్చేశానని.. వారికి ఎక్కడ రాజకీయ భవిష్యత్తు ఉంటుందనుకుంటే ఆ పార్టీలో ఉండవచ్చని వ్యాఖ్యానించారు. తన కుమారుడు ఎంపీగా ఉన్నప్పటికీ అనుచరులంతా టీడీపీకి మద్దతు ఇవ్వాలని గల్లా అరుణ కుమారి కోరకపోవడం విశేషం.