మాచర్ల నియోజకవర్గం షూటింగ్ అప్ డేట్స్

నితిన్ హీరోగా, ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చింది. చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ కూడా పూర్తయింది.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

మూవీ షూటింగ్ అప్ డేట్స్ తో పాటు బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో నితిన్, కృతి శెట్టి ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. నితిన్, కృతిశెట్టి జోడి రెఫ్రెషింగ్ గా ఉంది. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.