తుప్పన్న.. పప్పన్న.. నారన్న.. విజయసాయి సెటైరికల్ ట్వీట్..

కరకట్ట రాజకీయాలు ఇటీవల జోరుగా సాగుతున్నాయి. అయ్యన్నపాత్రుడు ఇల్లు పంట కాల్వను ఆక్రమించి కట్టారనే ఆరోపణలు రావడం, ప్రహరీ గోడను అధికారులు కూల్చేయడం, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఎపిసోడ్ లో అయ్యన్నది తప్పేనని తేలినా కూడా రాజకీయ కక్షతోనే ప్రహరీగోడ కూల్చేశారంటూ రాద్ధాంతం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చెణుకులు విసిరారు. అయ్యన్న దగ్గర మొదలు పెట్టి చంద్రబాబు, లోకేష్ ని కూడా ఆయన చెడుగుడు ఆడుకున్నారు.

ఇంతకీ విజయసాయి ఏమన్నారంటే..?

ఆ గట్టునున్నావా తుప్పన్నా..
ఈ గట్టునున్నావా పప్పన్నా..

ఆ గట్టునుంటే జనసేనకు నిప్పు…
ఈ గట్టునుంటే బీజేపీకి ముప్పు…
మరి ఏ గట్టునుంటావు నారన్న!

ఏ గట్టునైనా ఉన్నావో లేదో…
కరకట్టనున్నావు నారన్నా!
అంటూ కవితాత్మకంగా ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి. పనిలో పనిగా బీజేపీ, జనసేనకు కూడా చురకలంటించారు.

ఎలా అర్థం చేసుకుంటే అలా..!

ఆ గట్టునున్నావా, ఈ గట్టునున్నావా.. అంటూ అయ్యన్న కాల్వ గట్టున ఉన్నారనే విషయాన్ని హైలైట్‌ చేస్తూ.. విమర్శించారు విజయసాయి రెడ్డి. టీడీపీ ఏ గట్టున ఉంటే ఆ గట్టున ఉండే పార్టీకి ముప్పు అంటూ జనసేన, బీజేపీని కూడా అలర్ట్ చేశారాయన. ఇక చంద్రబాబు కూడా గతంలో కృష్ణానది కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉన్నారంటూ.. కరకట్ట నారన్న అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. విజయసాయి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.