ఎట్టకేలకు రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

ram-rao-on-duty

మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రవితేజ ఖిలాడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు న్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే పూర్తయింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని పలుమార్లు వాయిదా వేశారు.

చివరికి ఈ సినిమాను జూన్ 17వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా 17వ తేదీ కూడా విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. అనే గందరగోళం అభిమానుల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర మేకర్స్ రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇస్తూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో జూలై 29 వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా రవితేజ ఈ సినిమాతో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, వంశీ కృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు, సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించేందుకు అంగీకారం తెలిపాడు.