అరుదైన కలయిక.. వివాదాలు ఇక మాయం

prakash raj manchu

మొన్నటివరకు నిప్పు-ఉప్పుగా ఉన్నారు. కొన్ని నెలలుగా ఇద్దరూ ఎడమొహం-పెడమొహం. అంతలోనే సడెన్ గా ఉన్నట్టుండి ఎదురుపడ్డారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. నవ్వుతూ మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో వీళ్లిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. అసోసియేషన్ మేనిఫెస్టోతో మొదలుపెట్టి, వ్యక్తిగత స్థాయి వరకు ప్రతి అంశంలో ఇద్దరూ తిట్టుకున్నారు. ఒక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే రేంజ్ లో తిట్టుకున్నారు. ఆ తర్వాత మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం, ప్రకాష్ రాజ్ ఓడిపోవడం అందరికీ తెలిసిందే.

ఎన్నికల తర్వాత కూడా ఇద్దరి మధ్య ఓ స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా ప్రకాష్ రాజ్ రెడీ అయ్యాడు. అదే టైమ్ లో తన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇంత జరిగిన తర్వాత ఈరోజు విశ్వక్ సేన్ సినిమా ఓపెనింగ్ లో ఇద్దరూ కలుసుకున్నారు.

అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఈరోజు కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కలుసుకున్నారు. పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. గతంలో జరిగిన వివాదాలన్నింటినీ మరిచిపోయారు.