విజయ్ ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ లు ..!

Vijay Thalapathy

తమిళ అగ్రహీరో విజయ్ తన ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ లు ఇస్తూ ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఏదైనా అగ్రహీరో నటించే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం మామూలే. అయితే విజయ్ నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు వరుసగా సెకండ్ లుక్, థర్డ్ లుక్ పోస్టర్లు కూడా విడుదల చేసి అభిమానులను ఆశ్చర్య పరిచారు.

విజయ్ హీరోగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బుధవారం హీరో విజయ్ బర్త్ డే పురస్కరించుకొని మంగళవారం ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి వారసుడు అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు.

ఆ తర్వాత బుధవారం విజయ్ బర్త్ డే సందర్భంగా చిత్ర మేకర్స్ మరో సర్ప్రైజ్ ఇస్తూ సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతటితో ఆగకుండా అదే రోజు రాత్రి థర్డ్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూటు బూటు వేసుకొని కనిపించిన విజయ్, సెకండ్ లుక్ పోస్టర్ లో పిల్లలతో సరదాగా ఆడుకుంటూ కనిపించాడు. మళ్ళీ థర్డ్ లుక్ పోస్టర్ లో బైక్ పై కూర్చుని స్టైలిష్ లుక్ లో కనిపించాడు.

ఇలా ఒక అగ్ర హీరో నటించిన సినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, థర్డ్ లుక్ పోస్టర్లు బ్యాక్ టు బ్యాక్ విడుదల కావడం ఇదే మొదటిసారి. తమిళంలో అగ్ర హీరో అయిన విజయ్ నేరుగా ఒక తెలుగు సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. విజయ్ ఈ సినిమాతో పాటు విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో మరో సినిమా చేస్తున్నాడు.