వారసుడు వచ్చేశాడు

vijay

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘వారసుడు‘ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.

ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు విజయ్. సూట్ వేసుకొని స్టయిలిష్ గా కనిపించాడు. వారసుడు టైటిల్ కు ”ది బాస్ రిటర్న్స్” అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే చిత్రాలను రూపొందించే వంశీ పైడిపల్లి, ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి తమిళంలో ‘వారిసు’ టైటిల్ ని ఖరారు చేశారు.

రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై భారీ షెడ్యూల్‌ జరుగుతుంది.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్నాడు వారసుడు.