తొలిసారి విడాకులపై స్పందించిన సమంత

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితాలు వాళ్లు బతుకుతున్నారు. వాళ్లు విడిపోయినప్పట్నుంచి ఈరోజు వరకు వీళ్లిద్దరికి సంబంధించి ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇంతకీ వీళ్లు విడాకులు ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అటు సమంత, ఇటు నాగచైతన్యకు, వాళ్ల కుటుంబీకులకు మాత్రమే తెలుసు. బయట వ్యక్తులకు ఎవ్వరికీ వీళ్ల విడాకుల రీజన్ తెలియదు.

అలా సీక్రెట్ గా ఉన్న ఆ రీజన్ ను సమంత బయటపెట్టిందట. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా కాఫీ విద్ కరణ్ కార్యక్రమంలో పాల్గొంది సమంత. అందులో తన విడాకులకు సంబంధించిన కారణాల్ని ఆమె బయటపెట్టిందట.

ఇలాంటి వ్యక్తిగత విషయాల్ని బయటకు లాగడం కోసమే ఉద్దేశించిన కార్యక్రమం ఇది. గతంలో ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు ఈ షోలో పాల్గొని తమ వ్యక్తిగత వివరాలు బయటపెట్టారు. కొంతమంది హీరోయిన్లయితే శృంగార భంగిమల గురించి కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. అంతటి ‘ఘన చరిత్ర’ ఈ షో సొంతం.

సో.. ఇలాంటి కార్యక్రమానికి సమంత హాజరైనప్పుడే ఏదో స్పెషాలిటీ ఉంటుందని అంతా ఆశించారు. అందుకు తగ్గట్టుగానే తన విడాకులకు దారితీసిన కారణాల్ని సమంత ఆ కార్యక్రమంలో బయటపెట్టిందట. అయితే ఆ క్లిప్ ను కార్యక్రమంలో ఉంచుతారా కట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కు రాబోతోంది.