తండ్రి అయిన రాహుల్ రవీంద్రన్

ఎట్టకేలకు రాహుల్ రవీంద్రన్ తండ్రి అయ్యాడు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద దంపతులకు కవలలు జన్మించారు. ఈ విషయాన్ని ఈ జంట స్వయంగా ప్రకటించింది. పుట్టిన వెంటనే ఆ కవలలకు పేర్లు కూడా పెట్టారు.

తమ పిల్లలకు ద్రిప్తా, శర్వాస్ అనే పేర్లు పెట్టినట్టు రాహుల్ రవీంద్రన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా చిన్నారుల చేతి వేళ్లు చూపిస్తూ 2 ఫొటోలు కూడా షేర్ చేశారు. పెళ్లయిన 8 ఏళ్లకు ఈ జంట తల్లిదండ్రులుగా మారారు. 2014లో రాహుల్-చిన్మయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.

పెళ్లి తర్వాత చాలా ఏళ్ల పాటు పిల్లలు వద్దనుకుంది ఈ జంట. అందుకు తగ్గట్టుగానే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇన్నేళ్లకు పిల్లలు కావాలని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులు వేశారు. నిజానికి చిన్మయి గర్భందాల్చిన విషయం చాలామందికి తెలియదు. రీసెంట్ గా అడివి శేష్, తన మేజర్ సినిమా ప్రీమియర్ కు చిన్మయిని ఆహ్వానించాడు. బెస్ట్ ఫ్రెండ్ ఆహ్వానించడంతో గర్భంతోనే థియేటకు వచ్చి సినిమా చూసింది చిన్మయి. ఆ టైమ్ లోనే ఆమె గర్భవతి అనే విషయం అందరికీ తెలిసింది.

ప్రస్తుతం పిల్లలు, తల్లి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. రాహుల్ దంపతులకు సెలబ్రిటీల నుంచి
శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.