పెళ్లి సందడి ఓటీటీలోకి వచ్చేస్తోంది..

pelli sandadi

అదొక ఫ్లాప్ సినిమా. థియేటర్లలో డిజాస్టర్ అయింది. అలాంటి సినిమా ఓటీటీలోకి వస్తోందంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పెళ్లిసందD సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మాత్రం అందరూ పట్టించుకుంటున్నారు. ఫ్లాప్ అయినప్పటికీ స్ట్రీమింగ్ కు వస్తే చూద్దామని చాలామంది వెయిటింగ్. దీనికి కారణం శ్రీలీల.

పెళ్లిసందD సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆమె అందాలకు జనం ఫిదా అయ్యారు. ఈమధ్యకాలంలో ఇంత అందమైన ముద్దుగుమ్మను తెరపై చూడలేదు. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు ఈ ముద్దుగుమ్మను మరింత గ్లామరస్ గా చూపించారు. అలా బి, సి సెంటర్లలో శ్రీలీలకు ఫిదా అయ్యారు జనం.

ఇప్పుడా సినిమా ఓటీటీలోకి వస్తే శ్రీలీల అందాల్ని మరోసారి చూడొచ్చని కుర్రకారు ఎదురుచూస్తోంది. ఆ టైమ్ రానే వచ్చింది. జీ5 యాప్ లో జూన్ 24వ తేదీన పెళ్లిసందD సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. ప్రమోషన్ ను కూడా శ్రీలీల యాంగిల్ లోనే చేస్తున్నారు.

ఇప్పటికే శ్రీలీల టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ అయిపోయింది. ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. పెళ్లిసందD స్ట్రీమింగ్ సందర్భంగా ఆమె మరోసారి పాపులర్ అవ్వనుంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇందులో హీరోగా నటించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.