గన్ తో అదరగొట్టిన లావణ్య త్రిపాఠి

Lavanya happy birthday

మత్తువదలరా చిత్రంతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు రితేష్ రానా. తన రెండో ప్రయత్నంగా ఈ దర్శకుడు తీసిన సినిమా హ్యాపీ బర్త్‌డే. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. టీజర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రబృందం.. ఇటీవల చిత్రంలోని పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే హీరోయిన్ లావణ్యత్రిపాఠి పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు.

ఈ చిత్రంలో హ్యాపీ 340గా లావణ్య కనిపించబోతుంది. ఆమె పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా, పూర్తి వినోదాత్మకంగా ఉండబోతుందని చిత్ర బృందం తెలిపింది. పెద్ద గన్ పట్టుకొని స్టయిలిష్ గా లావణ్య నిల్చున్న స్టిల్ ఇది. ఈ సినిమా కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం రితేష్ రానా కాగా.. కాలభైవర సంగీతం అందించాడు.