విక్రమ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది

vikram-day-1-collections

జూన్ 3న విడుదలైన కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయిన 2-3 సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ సినిమా తమిళనాట సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విక్రమ్ సినిమా 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా నడుస్తోంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాల్ని అందించింది. ఇప్పుడీ సినిమా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. జులై మొదటి వారంలో స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 8న ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ రైట్స్ ను స్టార్ గ్రూప్ దక్కించుకుంది. అన్ని భాషల్లో, నాన్-థియేట్రికల్ రైట్స్ ను 110 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. స్టార్ గ్రూప్ తీసుకున్న ఈ ఖరీదైన నిర్ణయం సరైనదేనని, విక్రమ్ సినిమా నిరూపించించింది. త్వరలోనే ఈ సినిమా స్టార్ మా ఛానెల్ లో కూడా ప్రసారం అవుతుంది.

లాంగ్ గ్యాప్ తర్వాత విక్రమ్ తో హిట్ కొట్టారు కమల్ హాసన్. ఈ సినిమా సక్సెస్ తో ఆయన తన అప్పులన్నీ తీర్చేశారు. విక్రమ్ సినిమాతో పూర్తిగా ఆయన అప్పుల నుంచి బయటపడ్డారు.