నాగచైతన్య ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడా?

nagachaitanya bangarraju

సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య పెళ్లి, ప్రేమ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఆయన పెళ్లి చేసుకుంటాడని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నాగచైతన్యపై మరో పుకారు వినిపిస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాలతో అతడు డేటింగ్ చేస్తున్నట్టు కొన్ని న్యూస్ ఏజెన్సీలు రాసుకొచ్చాయి. వీళ్లిద్దరూ కలిసి రెస్టారెంట్లలో కనిపించారని కొన్ని హిందీ వెబ్ సైట్లు ప్రముఖంగా ప్రచురించాయి.

గుఢచారి, మేజర్ లాంటి సినిమాలతో పాపులర్ అయింది శోభిత. ఆమె ఓ తెలుగు స్టార్ తో డేటింగ్ చేస్తోందంటూ ముందుగా పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత అవి నెమ్మదిగా నాగచైతన్య వైపు టర్న్ తీసుకున్నాయి. ఇటు శోభితకైనా, అటు నాగచైతన్యకైనా ఇలాంటి పుకార్లు కొత్త కాదు. వీటిని వాళ్లు లైట్ తీసుకున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో సమంత మరోసారి బుక్కయింది. నాగచైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో అతడి అభిమానులు కొంతమంది పోస్టులు పెడితే, మరికొంతమంది ఫ్యాన్స్ సమంతను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

‘సమంత కోసం నాగచైతన్య ఎందుకు దేవదాస్ గా మారాలి. అతడు త్వరగా పెళ్లి చేసుకోవాలి’ అంటూ చాలా పోస్టులు కనిపించాయి. వీటిలో అత్యంత చెత్త ట్వీట్ కూడా ఒకటి ఉంది. దానికి సమంత రియాక్ట్ అయింది కూడా. ఇలాంటి ట్వీట్లకు భయపడేది లేదు అంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఆ చెత్త ట్వీట్ డిలీట్ అయింది.

అక్కడితో ఆగలేదు ఈ వ్యవహారం. ఎవరో ఒకరు సమంతను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. దీంతో సమంత ఈసారి మరింత ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. విడిపోయిన తామిద్దరం ఎవరి లైఫ్ వాళ్లు బతుకుతున్నామని, తమ మధ్య ఎలాంటి సమస్యల్లేవని, మధ్యలో ఫ్యాన్స్ కు ఎందుకు తొందర అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. ట్రోలింగ్ చేసే వ్యక్తులు తమ కుటుంబాలు, జీవితాలు చక్కదిద్దుకుంటే మంచిదని చురకలంటించింది.