‘ప్రిన్స్’ పోస్ట్ పోన్.. కొత్త విడుదల తేదీ ఇదే!

prince

వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలు తెలుగులో కూడా హిట్టవ్వడంతో శివకార్తికేయన్ కు టాలీవుడ్ లో పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు రెట్టింపు జోష్‌ తో టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ‘ప్రిన్స్‘ అనే పక్కా ఎంటర్‌ టైనర్‌తో రాబోతున్నాడు ఈ హీరో. కొన్ని రోజుల క్రితం హీరో శివకార్తికేయన్, హీరోయిన్ మరియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అదే టైమ్ లో రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడా రిలీజ్ డేట్ నుంచి వెనక్కి తగ్గింది యూనిట్.

ఒక హిలేరియస్ వీడియో ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ వీడియోలో.. శివకార్తికేయన్, అనుదీప్ సినిమా ఆలస్యానికి సత్యరాజ్‌ను నిందించారు. అయితే సత్యరాజ్ ఎంటరైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. తర్వాత హీరోయిన్ మారియా వచ్చి వారితో మాట కలిపింది. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషలలో ఈ సంభాషణ జరుగుతుంది. చివరిగా.. ఈ దీపావళికి ‘ప్రిన్స్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘జాతి రత్నాలు’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ ప్రమోషనల్ మెటిరియల్ కూడా ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ దీపావళికి విడుదల కానున్న తొలి చిత్రం’ ప్రిన్స్’. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=GoA-0tHI_4k