హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హాట్ కపుల్

రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విఘ్నేశ్ శివన్, నయనతార జంట.. థాయ్ లాండ్ లో ల్యాండ్ అయింది. ఓ స్టార్ హోటల్ లో దిగిన ఈ జంట.. అక్కడ అందమైన పరిసర ప్రాంతాల్లో విహరిస్తోంది. నయనతారతో హనీమూన్ కు సంబంధించిన స్టిల్స్ ను దర్శకుడు విఘ్నేష్ శివన్ షేర్ చేశాడు.

నిజానికి ఈ జంట ఇలా విహార యాత్రలకు కొత్త కాదు. ఏడేళ్లుగా వీళ్లు విహార యాత్రలకు వెళ్తూనే ఉన్నారు. ఎన్నో దేశాలు చుట్టేశారు కూడా. కాకపోతే అప్పుడు ప్రేమికులుగా విహరించిన ఈ జంట, ఇప్పుడు భార్యాభర్తలుగా కలిసి విహార యాత్ర చేస్తోంది. అందుకే థాయ్ లాండ్ ట్రిప్ కు హనీమూన్ అని పేరు పెట్టింది ఈ జంట.

చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు నయన్-విఘ్నేష్. ఆ పెళ్లికి రజనీకాంత్ తో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత మరింతమంది ప్రముఖులకు ఆమె చెన్నైలో పెద్ద పార్టీ ఇస్తుందని అంతా అనుకున్నారు.

కానీ నయనతార మాత్రం రిసెప్షన్ ఊసెత్తలేదు. భర్తతో కలిసి థాయ్ లాండ్ వెళ్లిపోయింది. కొన్ని రోజుల పాటు హనీమూన్ ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి చెన్నై వస్తుంది ఈ జంట. బహుశా అప్పుడు రిసెప్షన్ గురించి ఆలోచిస్తారేమో.