ఆ సినిమాకు ఆమె దర్శకురాలు కాదు

vaishnav

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇంకా చెప్పాలంటే మాస్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమా. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా డైరక్టర్ దగ్గరకొచ్చేసరికి ఒకటే కన్ఫ్యూజన్. ఒక సినిమాకు ఇద్దరు డైరక్టర్ల పేర్లు చక్కర్లు కొట్టడంతో అంతా అయోమయంలో పడ్డారు.

ఎట్టకేలకు ఈ డైలమా వీడింది. వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా డైరక్టర్ ఎవరో తేలిపోయింది. ఈ సినిమాను లక్ష్మీసౌజన్య (వరుడు కావలెను ఫేమ్) డైరక్ట్ చేస్తుందంటూ ప్రచారం జరిగింది. కానీ ఆమె చేయడం లేదు. ఈ సినిమాను శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు డైరక్ట్ చేయబోతున్నాడు. ఈ అయోమయ పరిస్థితి ఏర్పడడానికి ఓ కారణం ఉంది.

ఒకే టైమ్ లో అటు లక్ష్మీసౌజన్య, ఇటు శ్రీకాంత్ కథ చెప్పారు. పైగా ఇద్దరూ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నుంచే వెళ్లారు. శ్రీకాంత్ కథకు వైష్ణవ్ తేజ్ ఓకె చెప్పాడు. కానీ పొరపాటున లక్ష్మీసౌజన్య పేరు తెరపైకి వచ్చింది. మేకర్స్ ఈ మేరకు ప్రకటన చేశారు. శ్రీకాంత్ పేరు కన్ఫర్మ్ చేశారు.

తన కెరీర్ లో ఇప్పటివరకు కథాబలం ఉన్న సినిమాలే చేశాడు వైష్ణవ్ తేజ్. మరీ ముఖ్యంగా హీరోయిజం అనే యాంగిల్ లో ఆలోచించలేదు. తొలిసారిగా శ్రీకాంత్ దర్శకత్వంలో మాస్-మసాలా ఎలిమెంట్స్ ఉన్న పక్కా కమర్షియల్ కథ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు.