భోళాశంకర్ కొత్త షెడ్యూల్

bholaa

తన సినిమాలన్నింటికీ చిరంజీవి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా విడుదలైన వెంటనే కుటుంబంతో కలిసి విహార యాత్రకు విదేశాలకు వెళ్లారు చిరు. అదే టైమ్ లో ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో, ఆ గ్యాప్ ఇంకాస్త పెరిగింది. అలా సినిమాలకు అనుకోకుండా విరామం ఇచ్చిన చిరు, ఎట్టకేలకు మళ్లీ సెట్స్ పైకి వచ్చారు.

ఇవాళ్టి నుంచి చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ సినిమా కొత్త షెడ్యూల్ ను చిరంజీవి స్టార్ట్ చేశారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవిపై ఓ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ ఫైట్ సీన్ షూటింగ్ నడుస్తోంది.

గాడ్ ఫాదర్ సినిమాను ఇప్పటికే పూర్తిచేశారు చిరంజీవి. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు భోళా శంకర్ సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డారు. ఓవైపు బాబి డైరక్షన్ లో సినిమా చేస్తూనే, మరోవైపు భోళాశంకర్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ముందుగా భోళాశంకర్ షూట్ కంప్లీట్ అవుతుంది.

భోళాశంకర్ సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. చిరు-తమన్న కాంబోలో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి సైరా చేశాడు. భోళాశంకర్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు.