నెక్ట్స్ లెవెల్ లో ఆలోచించి చేశాడంట!

sumanth ashwin

సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సుమంత్ అశ్విన్, ఇప్పుడు తన ఆశలన్నీ 7 డేస్ 6 నైట్స్ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేసిన ఈ హీరో.. చాలా ఆలోచించి మరీ ఈ సినిమా చేశానని ప్రకటించుకున్నాడు.

“ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే… ఇందులో డిఫరెంట్ రోల్ చేశా. ఇంతకు ముందు చేసినవి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాలో నా పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉన్నప్పటికీ… కొన్ని అంశాలు లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్ ఉంటుంది. ‘7 డేస్ 6 నైట్స్’లో రియాలిటీకి దగ్గరగా ఉన్న రోల్ చేశా. నాకు కూడా వన్నాఫ్ ది బెస్ట్ రోల్. ఇప్పుడు ప్రేక్షకులు కూడా డిఫరెంట్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల కావచ్చు, మరొకటి కావచ్చు… ప్రేక్షకులు వరల్డ్ సినిమా చూశారు. అప్‌డేట్‌ అయ్యారు. వేరే లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళకు రీచ్ అవ్వాలంటే మనం కూడా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ చేయాలి. ఇది అలానే ఆలోచించి చేశాను.”

ఒక నార్మల్ యంగ్‌స్ట‌ర్‌. ఫిల్మ్ మేకర్ అవ్వాలని అనుకుంటాడు. జీవితంలో అతడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎక్కువ స్మోక్ చేస్తాడు. వెయిట్ చేస్తాడు. తన మీద కేర్ తీసుకోడు. అటువంటి మనిషి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో ‘7 డేస్ 6 నైట్స్’ లో చూపించామంటున్నాడు సుమంత్ అశ్విన్.

సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్మెస్ రాజు డైరక్ట్ చేసిన ఈ సినిమా ఈనెల 24న వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. టైటిల్ చూసి ఇదేదో బోల్డ్ సినిమా అనుకోవద్దని, కుటుంబంతో పాటు అందరూ కలిసి చూడొచ్చుని చెబుతున్నాడు సుమంత్ అశ్విన్.