ఏజెంట్ బ్యూటీ ఫస్ట్ లుక్ రిలీజ్

sakshi-vaidya 2

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్. స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. సాక్షి వైద్య పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బర్త్ డే స్పెషల్ పోస్టర్ లో.. లవ్లీ స్మైల్ తో అందంగా, స్టయిలిష్ గా కనిపించింది సాక్షి వైద్య.

ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు.

ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.