భూతంగా మారిన ప్రభుదేవా.. లుక్ అదిరింది

Prabhudeva bhootam

డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేశాడు ప్రభుదేవా. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలో ఉన్న టాలెంట్ బయటపెట్టాడు. ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభు దేవా మార్క్ కనిపించింది. ఈ క్రమంలోనే ప్రభుదేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’. డిఫరెంట్ కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా తాజాగా ఈ మై డియర్ భూతం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫాంటసీ మూవీలో జినీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ అలరించనుంది. జీనీ పాత్రలో ప్రభుదేవా లుక్ బాగుంది. ఈ లుక్ కోసం ప్రభుదేవా ఎలాంటి విగ్ వాడలేదు.

మై డియర్ భూతం చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు.