గ్యాప్ ఇవ్వవా సత్యదేవా!

Gurthundaa Seethakalam

సినిమా సక్సెస్ అయిందా, ఫ్లాప్ అయిందా అనేది సత్యదేవ్ కు అనవసరం. సినిమా కంప్లీట్ అయిందా లేదా? రిలీజ్ అయిందా లేదా అనేది మాత్రం ఈ హీరో చూస్తాడు. మొన్నటిమొన్న గాడ్సే సినిమాను రిలీజ్ చేసిన ఈ హీరో, అంతలోనే మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు. ఈరోజు రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు.

సత్యదేవ్, తమన్నా జంటగా నాగ శేఖర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. ఈ పాట అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. సినిమాను జులై 15న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు.

ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నతో పాటు మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి ఇందులో హీరోయిన్లుగా నటించారు.