శశివదనే ఫస్ట్ లుక్ రిలీజ్

Sasivadane

రక్షిత్ అట్లూరి హీరోగా గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. రఘు కుంచె, శ్రీమాన్, రంగస్థలం మహేష్, ప్రిన్స్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సాయిమోహన్ ఉబ్బన దర్శకుడు. అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

గోదావరి నేపథ్యంలో తీస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా లో లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. దీంతో పాటు.. మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.