అందరికీ థ్యాంక్స్ చెప్పిన సాయిపల్లవి

sai pallavi

విరాటపర్వం విడుదల తర్వాత తొలిసారిగా స్పందించింది సాయిపల్లవి. తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పింది. ఓ మంచి కథను చెప్పినప్పుడు ఆడియన్స్ ప్రోత్సహిస్తే, మరిన్ని మంచి కథలు చెప్పాలనిపిస్తుందని.. విరాటపర్వంతో ఆ నమ్మకాన్ని మరోసారి కలిగించారని అంటోంది.

“సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసు వున్న వాళ్ళు మళ్ళీ పుడతారు, వాళ్ళు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. విరాటపర్వంతో అది నిజమైంది. సరళ మళ్లీ పుట్టింది. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా.

ప్రేక్షకులు సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా వుంది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడండి. చూసిన ప్రతీ సారి కొత్త అనుభూతిని పొందుతారు”

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. మొదటి రోజు ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. సినిమా బాగుందనే టాక్ బయటకొచ్చినప్పటికీ, థియేటర్లకు ఎవ్వరూ వెళ్లలేదు. ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబట్టింది, ఎంత రికవర్ అవుతుందనే విషయం రేపటికి తేలిపోతుంది.