24న పార్టీ ఇస్తున్న ‘పెళ్లికూతురు’

pelli-kuthuru-party-release-date

ప్రిన్స్‌, అర్జున్ క‌ళ్యాణ్, అనీషా ధామా, సీత‌, జ‌య‌త్రీ, సాయికీర్త‌న్‌, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్‌. స్వామి నిర్మించారు. అప‌ర్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌యిన ఈ సినిమాను జూన్ 24న విడుద‌ల చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు వెల్ల‌డించారు.

కరోనా టైమ్ నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది అమ్మాయిల‌ క‌థ‌. ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో క‌థ చెప్పారు. సీనియర్ నటి అన్న‌పూర్ణ‌మ్మ‌ ప్ర‌ధాన పాత్ర పోషించారు. హీరో ప్రిన్స్‌, అర్జున్ క‌ళ్యాణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా.. ఫ‌న్ అడ్వంచ‌ర్ రైడ్ గా ఉంటుందంట.

ఇది యూత్ సినిమా కాదని, కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అని అంటోంది యూనిట్. శ్రీకర్ అగస్త్య ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈమధ్య రిలీజ్ డేట్స్ మారి థియేటర్లలోకొచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయని, అలా చూసుకుంటే, వరుసగా వాయిదా పడుతున్న తమ సినిమా కూడా హిట్టవుతుందని అంటున్నాడు హీరో ప్రిన్స్.