ఓటీటీలోకి అడుగుపెట్టిన మరో హీరో

aadi-saikumar-ott-debut-2

ప్రస్తుతం ఓటీటీ హవా జోరుగా సాగుతోంది. చిన్నచిన్న హీరోలతో పాటు నాగచైతన్య లాంటి మార్కెట్ ఉన్న హీరోలు సైతం ఓటీటీలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటుడు చేరాడు. అతడే ఆది సాయికుమార్. ఆది హీరోగా కొత్త వెబ్ సిరీస్ లాంచ్ అయింది.

జీ5 లాంఛ్ చేసిన పులి-మేక అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెడుతున్నాడు ఆది సాయికుమార్. ఈ వెబ్ సిరీస్ కు కోన వెంకట్ కథ అందిస్తున్నాడు. చక్రవర్తి దర్శకత్వం వహిస్తాడు. గతంలో గోపీచంద్ హీరోగా పంతం సినిమాను తెరకెక్కించింది ఈ దర్శకుడే. అన్నట్టు ఇదే వెబ్ సిరీస్ తో హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఓటీటీలో అడుగుపెడుతోంది.

కొన్నేళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు ఆది సుకుమార్. ఏడాదికి 2-3 సినిమాలు చేస్తున్నప్పటికీ ఏదీ క్లిక్ అవ్వడం లేదు. రీసెంట్ గా కాన్సెప్ట్ సినిమాలు స్టార్ట్ చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఇప్పుడు ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు ఆది.

ఇకపై మంచి కథలు దొరికితే ఓటీటీలో కూడా నటిస్తానంటున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ హీరో తీస్ మార్ ఖాన్ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. మరో 2 సినిమాలు లైన్లో ఉన్నాయి.