హైదరాబాద్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య‌

హైదరాబాద్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష‌ గరిమెళ్ళ ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ లోని ఆమె ఇంట్లో బొగ్గుల కుంపటిలో కార్బన్ మోనాక్సైడ్ కెమిల వేసి ఆ వాయువు పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ప్రత్యూష బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి పేరున్న ఫ్యాషన్ డిజైనర్. సౌత్ సినీ పరిశ్రమలో చాలా మంది ఆమెతో డ్రెస్ డిజైన్ చేయించుకుంటారు.

దీపికా పడుకొణె, శృతి హాసన్, పణీత, రకుల్ ప్రీత్ సింగ్, చార్మి తదితర ప్రముఖ హీరోయిన్లకు ఆమె డెస్సులు డిజైన్ చేస్తారు. పలువురు హీరోలకు కూడా ఆమె డెస్సు డిజైన్ చేస్తారు. కాగా కొంత కాలంగా ప్రత్య్శ్హ తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు.

అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్, పోలీసుల విచారణ ఆమె మరణానికి అసలైన కారణాలు తెలియవచ్చు.