చార్లీ 777పై రానా రియాక్షన్ ఇది

ప్రతి సినిమాను సమర్పించడు రానా. మనసుకు హత్తుకునే సినిమాల్ని మాత్రమే తన బ్యానర్ పై ప్రజెంట్ చేస్తుంటాడు.
కేరాఫ్ కంచరపాలెం సినిమా చూస్తే రానా టేస్ట్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడీ హీరో మరో సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు. అదే చార్లీ-777.

ఈ సినిమా కూడా డిఫరెంట్ సినిమానే. చార్లీ అనే కుక్క చుట్టూ తిరిగే ఎమోషనల్ సినిమా ఇది. ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన రానాకు, చార్లీ చాలా బాగా నచ్చింది. అందుకే వెంటనే ప్రజెంట్ చేయడానికి అంగీకరించాడు. తెలుగు రాష్ట్రాల్లో తానే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

‘‘పాండమిక్ సమయంలో రక్షిత్‌కి నాకు ఫోన్స్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఛార్లి 777 వంటి డిఫ‌రెంట్ సినిమా చేస్తున్నార‌ని తెలియ‌గానే .. ఏదో ఇళ్ల‌ల్లో చేసేస్తార‌ని నేను అనుకున్నాను. కానీ ట్రయిలర్ చూసిన త‌ర్వాత ఎంత స్కేల్‌, స్పాన్ లో సినిమా చేశారో అర్థ‌మైంది. చూసిన వెంట‌నే క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి. చాలా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లు సాధించే సినిమాలు చేసే అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ 170 రోజులు.. కాశ్మీర్ స‌హా వివిధ ప్రాంతాల్లో ఛార్లిని తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఇలాంటి ఛార్లి 777 సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను’’

రక్షిత్ హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. కిరణ్ రాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో నటించిన కుక్క పేరు చార్లి. లీడ్ రోల్ దానిదే.