వారియర్ మూవీ అప్ డేట్స్

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో హీరో రామ్ నటిస్తున్న సినిమా ‘ది వారియర్‘. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లింగుస్వామి దర్శకుడు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా.. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

ఇవాళ్టితో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. గత వారం రోజులుగా హీరో రామ్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశారు.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్‌తో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. దీంతో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు మొదలయ్యాయి.

వారియర్ కు సంబంధించి ఆల్రెడీ విడుదలైన టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ పరంగా, టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో ఉందని చెబుతున్నారంతా. టీజర్‌లో డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా హై స్టాండ‌ర్డ్స్‌లో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమాను విడుదల చేయబోతున్నారు.

రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా, ఆది పినిశెట్టి విలన్ గా, అక్షర గౌడ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.