మహేష్-త్రివిక్రమ్ సినిమాలో తారకరత్న?

మహేష్ బాబు తిన్న అతి చెత్త వంటకం

నిన్నంతా హోరెత్తిపోయిన న్యూస్ ఇది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఓ  కీలకమైన నెగెటివ్ పాత్ర కోసం తారకరత్నను తీసుకున్నారనేది ఆ ప్రచారం. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఇది కేవలం గాసిప్ మాత్రమే.

తన సినిమాల్లో చిన్న పాత్రలకు సైతం పేరున్న నటీనటుల్ని తీసుకోవడం త్రివిక్రమ్ కు అలవాటు. అతడి సినిమాల్లో
భారీ తారాగణం కనిపిస్తుంది. ఉన్నది ఒక్క సీన్ అయినప్పటికీ అందులో కాస్త ఫేస్ వాల్యూ ఉన్న స్టార్ ను ఇరికించే ప్రయత్నం చేస్తుంటాడు త్రివిక్రమ్. అలా ఈ సినిమాలోకి తారకరత్న వచ్చాడనే ప్రచారం జరిగింది.

ఇంతకీ ఈ ప్రచారం ఎలా మొదలైందో తెలుసా? ఎవరో ఆకతాయి, ట్విట్టర్ లో తారకరత్న పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్
చేశాడు. మహేష్ బాబు సినిమాలో చేస్తున్నానంటూ అందులో తనకుతానుగా ప్రకటించుకున్నాడు. చాలామంది దాన్ని
ఒరిజినల్ ప్రొఫైల్ అని పొరబడ్డారు. అలా ఈ మేటర్ వైరల్ అయిపోయింది.

మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే లాక్ అయింది. జూన్ చివరి వారం లేదా జులైలో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్ లో ఉన్నాడు.