ఎఫ్3 మూవీ 2 రోజుల వసూళ్లు

ఎఫ్3 సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా? 63 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ మార్క్ అందుకుంటుందా అందుకోదా? మొదటి రోజు వసూళ్లు చూసి ఇలా చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. పైగా టికెట్ రేట్లు కూడా పెంచలేదు కాబట్టి, మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అలా అనుమానం వ్యక్తం చేసిన జనాలంతా రెండో రోజు వసూళ్లు చూసి సైలెంట్ అయ్యారు.

అవును.. ఎఫ్3 సినిమాకు రెండో రోజు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు 10 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజుకు తన షేర్ ను 18 కోట్ల  77 లక్షల రూపాయలకు పెంచుకుంది. ఆదివారం ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఇలా చూసుకుంటే.. ఫస్ట్ వీకెండ్ కే ఈ సినిమా సగం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్3 సినిమాకు 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – 8.16 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.23 కోట్లు
సీడెడ్ – 2.41 కోట్లు
గుంటూరు – 1.42 కోట్లు
నెల్లూరు – 0.86 కోట్లు
ఈస్ట్ – 1.28 కోట్లు
వెస్ట్ – 1.23 కోట్లు
కృష్ణ – 1.18 కోట్లు