ఆడోళ్లతో బూతులు తిట్టిస్తారా?.. అది మహానాడా? వల్లకాడా?

టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. నిండు నూరేళ్లు బతకాల్సిన ఎన్టీఆర్ ను చంద్రబాబు 27 ఏళ్ల క్రితమే చనిపోయేలా చేశారని విమర్శించారు. బతికి ఉన్నప్పుడు ఆయనను ఏనాడూ గౌరవించలేకపోయిన చంద్రబాబు .. ఇప్పుడు శతజయంతి ఉత్సవాలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మహానాడులో ఆడోళ్లతో బూతులు తిట్టిస్తూ దాన్నో వల్లకాడుగా మార్చారని విమర్శించారు.

తొడలు కొడుతూ కొందరు చిల్లరగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో తొడలు కొట్టిస్తే.. వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు నటించే చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తొడపాశం పెడతారని వ్యాఖ్యానించారు.

నేడు వందో పుట్టినరోజు జరుపుకోవాల్సిన తారక రాముడికి 27 ఏళ్ళ క్రితమే నూరేళ్లు నిండేలా చేసిన చంద్రబాబు ఆయనకు దండలు వేయడం ఆశ్చర్యంగా ఉంది. ఛీ.. ఛీ..కోకిలలు కొద్ది రోజులే బతుకుతాయి.. కాకులు మాత్రం కలకాలం బతుకుతాయని విమర్శించారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం చౌతాలాకు ఢిల్లీ సీబీఐ కోర్టు 4 ఏళ్ల శిక్ష విధించింది. 6 కోట్ల ఆస్తులకు ఆయన లెక్క చూపలేకపోయారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి 2005లో చంద్రబాబుపై ఇలాంటి కేసే వేసింది. 17 ఏళ్లుగా స్టేలతో విచారణకు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.