‘మేజర్’కు భారీగా టికెట్ రేట్లు తగ్గింపు

major

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సినిమాను అందరికీ అందుబాటులో ఉంచాలని.. సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు అమాంతం తగ్గించారు మేకర్స్.

తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర 150 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 147, మల్టీప్లెక్స్‌లలో 195, 177 రూపాయలుగా ధరలు ఉంటాయని తెలిపారు. కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో రాబోతున్న చిత్రం ఇదే.

చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను అందరికీ అందుబాటులో తెచ్చారు నిర్మాతలు. ఈ నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంతో పాటు అన్ని వర్గాలకి ధరలు అందుబాటులో వుండటం వలన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉంటాను. మల్టీప్లెక్స్ విషయానికొస్తే, మేజర్ సినిమా టికెట్ రేటు ఒక్కసారిగా 100 రూపాయలు తగ్గినట్టయింది.

కాగా థియేట్రికల్ రిలీజ్ కి ముందే దేశవ్యాప్తంగా ప్రీమియర్‌లను నిర్వహిస్తూ మేజర్ యూనిట్ మరో ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ పూణెలో ఓ షో పడిపోయింది. అక్కడి ప్రేక్షకులు నిల్చొని చప్పట్లు కొట్టి సినిమాను మెచ్చుకున్నారు.