ఎఫ్3 మూవీ మొదటి రోజు వసూళ్లు

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 మూవీ మొదటి రోజు మెరిసింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు 36 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నిజానికి ఈ సినిమాకు 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ ఊహించింది ట్రేడ్. ఎందుకంటే, సినిమాపై ఉన్న అంచనాలు అలాంటివి. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు పెద్దగా కనిపించలేదు.

ఫలితంగా 10 కోట్ల రూపాయల షేర్ దగ్గరే సినిమా ఆగిపోయింది. ఈ వీకెండ్ ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని యూనిట్ చెబుతోంది. పైగా పెద్ద సినిమాలేవీ దగ్గర్లో లేకపోవడంతో, వచ్చే ఏడాది 1వ తేదీ నుంచి ఎఫ్3కి కుటుంబ ప్రేక్షకులు వస్తారని ఆశిస్తోంది.

తెలుగు రాష్టాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 52 కోట్ల రూపాయలు రావాలి. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా మొదటి రోజే హాఫ్-మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుకుంది. 5 లక్షల డాలర్లు ఆర్జించింది. అయితే ఓవర్సీస్ లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు ఎఫ్3కి వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 4.06 కోట్లు
ఉత్తరాంధ్ర – 1. 18 కోట్లు
గుంటూరు – 88 లక్షలు
నెల్లూరు 62 లక్షలు
ఈస్ట్ – 76 లక్షలు
వెస్ట్ – 94 లక్షలు
కృష్ణా – 67 లక్షలు
సీడెడ్ – 1.26 కోట్లు