బింబిసార నుంచి ‘ఎన్టీఆర్ శతజయంతి’ పోస్టర్

మే 28.. నందమూరి తారక రామారావు జయంతి. ఆయనకు ఇది శత జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.

‘బింబిసార’ పోస్టర్‌ను గమనిస్తే .. అందులో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి క్రూరుడైన రాజు లుక్ కాగా.. మరో లుక్ స్టైలిష్‌గా ఉంది. ఈ రెండు లుక్స్‌లోనూ కళ్యాణ్ రామ్ రాయల్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 5న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.

హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడుగా కనిపించనున్నాడు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. బింబిసార‌లో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కం. భారీ సెట్స్‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వాల్యూస్ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ త్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.