అందుకే అంత హుషారు వచ్చింది

ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ లో చాలా హుషారుగా కనిపించారు వెంకటేష్. ఇంటర్వ్యూలో అతడి హుషారు, ఉత్సాహం చూసి ప్రేక్షకులు కూడా సరదా పడ్డారు. సినిమాలో కూడా అంతే హుషారుగా నటించారట వెంకటేష్. మరి వెంకీకి ఇంత హుషారు ఎలా వచ్చింది.

“ఏదైనా స్క్రిప్ట్ ప్రకారమే ఉంటుంది. ఇచ్చిన స్క్రిప్ట్ కి డబుల్ డోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అయితే ఏదీ ప్లాన్ చేసుకోను. స్పాంటేనియస్ గా వస్తుంటాయి. కొన్నిసార్లు నేను చేసింది మర్చిపోతాను. దర్శకుడు అనిల్ మళ్ళీ గుర్తు చేసి అది బావుంది మళ్ళీ చేయండని అడుగుతారు. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి..ఇలా ఏ సినిమా తీసుకున్నా.. పెద్ద ప్లాన్ చేయడం అంటూ ఏమీ వుండదు. స్పాంటేనియస్ గానే వుంటుంది.”

ఇలా తన హుషారు వెనక రీజన్ బయటపెట్టారు వెంకటేశ్. సెట్స్ లో ఉన్న ఆ హుషారును.. ఎఫ్3 రిలీజ్ వరకు ఇలానే కొనసాగిస్తానని, అందుకే ఇంత చలాకీగా కనిపిస్తున్నానని వెంకీ వివరణ ఇచ్చుకున్నారు. బిత్తిరి సత్తితో చేసిన ఇంటర్వ్యూలో అయితే, ఏకంగా అతడ్ని ఓ ఆట ఆడేసుకున్నారు వెంకీ. సత్తి మేనరిజమ్స్, యాసను ఇమిటేట్ చేసి అందర్నీ నవ్వించారు.