సీతారామం విడుదల తేదీ ఇదే

sita ramam movie

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం‘. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ హీరోయిన్ రష్మిక ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ప్రమోషనల్ కంటెంట్‌ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తేదీని తాజాగా నిర్మాతలు ఖరారు చేశారు. ఆగస్టు 5న ‘సీతా రామం’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘ఓ సీతా- హే రామా’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలొడీ సినిమాపై అంచనాల్ని ఇంకాస్త పెంచింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

దుల్కర్, మృణాళిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా.. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, శత్రు, భూమిక చావ్లా, రుక్మిణి విజయ్ కుమార్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.