ఎఫ్ 3 లో మూడో హీరో ఎందుకు లేడు?

f3 movie

ఎఫ్2 లో ఇద్దరు హీరోలున్నారు. కాబట్టి ఎఫ్ 3 తీసినప్పుడు అందులో ముగ్గురు హీరోలు ఉంటారని చాలామంది అనుకున్నారు. కానీ ఎఫ్ 3లో కూడా ఆ ఇద్దరే హీరోలుగా ఉన్నారు. హీరోయిన్ల సంఖ్యను మాత్రం పెంచాడు దర్శకుడు అనీల్ రావిపూడి. దీనిపై ప్రశ్నించగా, ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

“ఎఫ్ 2 ఫినిష్ అయ్యాక ఎఫ్ 3 గురించి అలోచించినపుడు మూడో హీరో ఆలోచన వచ్చింది. ఐతే అది ట్రంప్ కార్డు . అది ఇప్పుడే వాడేస్తే మళ్ళీ వాడుకోవడానికి ఏమీ వుండదు. అందుకే ఆ ఐడియాని పక్కన పెట్టేశాం. ఎఫ్ 2 స్టార్ కాస్ట్ తోనే వీలైనంత ఫన్ జనరేట్ చేశాం. ఐతే మూడో హీరో కార్డు మాత్రం ఎఫ్ 4లో కానీ తర్వాత సినిమాలో కానీ తప్పకుండా వాడాలి.”

ఇలా ఎఫ్2 ఫ్రాంచైజీలో మూడో హీరోపై స్పందించాడు అనీల్ రావిపూడి. నిజానికి ఈ సినిమా ప్రారంభం కాకముందు, ఆ మూడో హీరోగా రవితేజను తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అప్పట్లో పరోక్షంగా ఆ ప్రచారం నిజమేనని అనీల్ రావిపూడి కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తిరిగి ఇద్దరు హీరోలతోనే కథను నడిపించాడు.

తాజా స్టేట్ మెంట్ ప్రకారం చూస్తే, ఎఫ్2 ఫ్రాంచైజీలోకి మరో హీరోను తీసుకొచ్చే ఆలోచన రావిపూడికి బాగా ఉంది. తదుపరి సినిమా కోసమైనా ఈ ట్రంప్ కార్డును అతడు వాడతాడేమో చూడాలి.