ఇకపై అన్నీ ఆ నిర్మాతలతోనే అంటున్న అనుష్క

టాలీవుడ్ మేకర్స్ కు అనుష్క స్పష్టమైన సందేశం ఇచ్చేసింది. ఇకపై తను సినిమాలు చేస్తే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మాత్రమే చేస్తానని, బయట నిర్మాతలకు సినిమాలు చేయనని చెప్పేసిందట. ఈ మేరకు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క పూర్తిగా సినిమాలు తగ్గించేసింది.

ప్రస్తుతం ఈమె చేతిలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చేయాల్సిన మూవీ మాత్రమే ఉంది. నవీన్ పొలిశెట్టి ఇందులో హీరో. సినిమా మాత్రం అనుష్క చుట్టూరా తిరుగుతుంది. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత, మరో సినిమా చేయాల్సి వస్తే, అది యూవీ బ్యానర్ లోనే అని అంటోంది అనుష్క.

నిశ్శబ్దం సినిమా టైమ్ లో అనుష్క బొద్దుగా ఉంది. అదే ఫిజిక్ తో ఆమె నటించింది. దాన్ని కవర్ చేసేందుకు, అనుష్కను స్లిమ్ గా చూపించేందుకు గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. దాన్ని వాళ్లు మీడియాకు కూడా అందించారు. అప్పట్నుంచి బయట నిర్మాతలకు సినిమాలు చేయకూడదని అనుష్క నిర్ణయించుకుంది. అదే యూవీ నిర్మాతలైతే అనుష్కను సూపర్ స్టార్ గా చూస్తారు. సకల మర్యాదలు చేస్తారు. అదీ సంగతి.