ఏజెంట్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

అక్కినేని అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్. స్టైలిష్ స్పై థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకుంటున్న ‘ఏజెంట్‘ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పర్యవేక్షిస్తున్నాడు. అఖిల్‌ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రసూల్ ఎల్లోర్, విజయ్ మాస్టర్‌ సెట్స్ లో కనిపించారు.

హై వోల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు.

ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 12న ఏజెంట్ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ మరోసారి ప్రకటించారు.