పుకార్లు ఖండించిన ఖుషి యూనిట్

kushi

సమంతకు గాయాలయ్యాయంట. విజయ్ దేవరకొండ తీవ్రంగా గాయపడ్డాడట. నిన్నట్నుంచి సోషల్ మీడియాను ఊపేస్తున్న పుకార్లు ఇవి. ఓవైపు ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయిందనే ఆనందంలో యూనిట్ ఉంటే, మరోవైపు ఇలా ఈ పుకార్లు వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటిపై తాజాగా దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చాడు

ఖుషి యూనిట్ లో ఎవ్వరూ గాయపడలేదని ప్రకటించాడు శివ నిర్వాణ. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత పాటు అందరం హ్యాపీగా ఉన్నామని ప్రకటించాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో జరిగింది. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ చేశారు. ఈ షూటింగ్ లోనే హీరోహీరోయిన్లు గాయపడ్డారంటూ ఊహాగానాలు చెలరేగాయి. వాటిని యూనిట్ ఖండించింది.

ప్రస్తుతం ఖుషి యూనిట్ రెస్ట్ తీసుకుంటోంది. త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వైజాగ్, అలెప్పిలో మరో షెడ్యూల్ ఉంటుంది. సెప్టెంబర్ నాటికి టోటల్ సినిమా షూటింగ్ పూర్తి చేసి, డిసెంబర్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చే సినిమా ఇదే.

ALSO READ: వరుణ్ తేజ్ తో ఆడుకున్న బిత్తిరి సత్తి