అన్నలా నమ్మించి వదినపై నెలల తరబడి లైంగిక దాడి.. ఒక కవల సోదరుడి అఘాయిత్యం

అజిత్ హీరోగా అప్పట్లో ‘వాలి’ అనే సినిమా వచ్చింది గుర్తుందా? అందులో అజిత్ కవలలుగా నటించారు. పెద్ద అజిత్‌కు చిన్న అజిత్ భార్యపై కన్నుంటుంది. తానే తమ్ముడినని లోబర్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ తమ్ముడి భార్య మాత్రం అతడిని కనిపెట్టేస్తుంది. ఇలాంటివి నిజజీవితంలో జరుగుతాయా అని అందరికీ డౌటనుమానం రావొచ్చు. కానీ, మహారాష్ట్రలో అచ్చం ఇలాంటి సంఘటనే చోటు చేసుకున్నది. అయితే ఇక్కడ ఆ దుష్ట ఆలోచనలను వదిన గ్రహించలేక నెలల తరబడి అత్యాచారానికి గురైంది.

మహారాష్ట్రలోని లాతూర్‌లోని ఒక కుటుంబంలో కవల సోదరులు ఉన్నారు. ఇద్దరు కూడా అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉండటంతో కొత్త వాళ్లు వారిని పోల్చుకోవడం కష్టం. తల్లిదండ్రులకు ఇద్దరి మధ్య చిన్న తేడాలు తెలిసినా.. కొత్త వారికి మాత్రం కష్టమే. ఈ క్రమంలో అన్నకు ఆరు నెలల క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుంచే అన్న భార్యపై కన్నేసిన తమ్ముడు దుష్టపన్నాగానికి తెరతీశాడు. అన్నలేని సమయంలో వదిన గదిలోకి వెళ్లి.. అతడిలాగే నమ్మించి లైంగిక కోరికలు తీర్చుకోసాగాడు. తనతో శృంగారం చేస్తున్నది తన భర్తే అని అనుకొని ఆమె కూడా సహకరించింది.

ఈ క్రమంలో ఇటీవల ఆమెకు తన దగ్గరకు వచ్చేది భర్త కాదు మరిది అనే అనుమానం వచ్చింది. ఒక రోజు తన గదికి వచ్చిన వ్యక్తి భర్త కాదు మరిది అని గుర్తు పట్టేసింది. వెంటనే ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. జరుగుతున్న అఘాయిత్యాన్ని భర్తకు చెబితే..

చాలా కూల్‌గా తీసుకొని, తన తమ్ముడితో ఆ సంబంధాన్ని కొనసాగించమని చెప్పాడు. ఆ మాట విని షాక్‌కు గురైన ఆమె ఈ విషయాన్ని అత్తమామలకు చెప్పింది. అయితే, వాళ్లు కూడా భర్త మాటలనే సమర్దించారు. తన అత్తింటి వాళ్లు కావాలనే ఇలా చేస్తున్నారని గ్రహించిన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు.