రైలు టిక్కట్లపై ఇక మీద‌ సీనియర్ సిటిజన్లకు రాయితీ లేదు

రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు టిక్కట్టు ధరల్లో రాయితీ ఎత్తేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ రైలు టిక్కట్లలో 60 ఏళ్ళు దాటిన పురుషులకు 40 శాత‍ం, 58 ఏళ్ళు దాటిన స్త్రీలకు 50 శాతం రాయితీ ఇచ్చేవాళ్ళు. ఇకపై ఆ రాయితీని ఎత్తేస్తున్నట్టు ఐఐటీ మద్రాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

రైల్వేలు ఇప్పటికే సబ్సిడీ రేటుతో పనిచేస్తున్నందున సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించడం సాధ్యం కాదన్నారాయన‌. “నిర్వహణ ఖర్చుల కోసం ఒక ప్రయాణీకుడి పై ఖర్చు చేసే ప్రతి 100 రూపాయలకు రైల్వే ఒక ప్రయాణీకుడి నుండి 45 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. రైల్వేను సుస్థిరమైన రవాణా మార్గంగా నిలపడంలో మనం సహకరించాలి” అని అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

కరోనా మహమ్మారి వ్యాపించక ముందు సీనిఅయ్ర్ సిటిజన్ లకు రాయితీలు ఇచ్చేవారు. అయితే కరోనా కాలంలో అన్ని రైళ్ళు ఆగిపోయిన తర్వాత తిరిగి ఈ మధ్యే ప్రారంభించారు. కానీ సీనియర్ సిటిజనులకు రాయితీలు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే త్వరలోనే పునరుద్దరిస్తారని భావిస్తున్న తరుణంలో రాయితీలు ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి ప్రకటించడం వృద్దులకు నిరాష కలిగించింది.

ALSO READ: దేశంలో ధరలు పెరడానికి కారణాలివే