పూజా హెగ్డే ని నిలువునా దోచేశారంట

ప్రస్తుతం కాన్స్ లో ఉంది పూజా హెగ్డే. 11 మంది సభ్యుల ఇండియన్ డెలిగేట్స్ టీమ్ లో ఆమె షో రన్నర్. రెడ్ కార్పెట్ పై హొయలు కూడా ఒలికించింది. ప్రెస్ మీట్ లో అద్భుతంగా మాట్లాడింది. బ్రాండ్ ఇండియా ఇమేజ్ ను కాన్స్ వేదికగా చక్కగా ప్రజెంట్ చేసింది. అయితే దీని వెనక ఆమెది, ఆమె టీమ్ ది చాలా కష్టం ఉంది. ఆ విషయాల్ని స్వయంగా పూజా బయటపెట్టింది.

“కాన్స్ కోసం అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యాను. సరిగ్గా రెడ్ కార్పెట్ ముందు రోజు నా వస్తువులన్నీ దొంగతనానికి గురయ్యాయి. నా డిజైనరీ గార్మెంట్స్, మేకప్ కిట్స్, యాక్ససిరీస్ అన్నీ పోయాయి. నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ మాత్రం మిగిలింది. అందులో ఇంటి నుంచి తెచ్చుకున్న 2 బంగారు వస్తువులు మాత్రం ఉన్నాయి. దీంతో చాలా టెన్షన్ పడ్డాం. దుస్తులు, యాక్ససిరీస్ అన్నీ గంటల్లో సమకూర్చుకున్నాం. పొద్దున్నుంచి ఎవ్వరూ భోజనం కూడా చేయకుండా పనిచేశాం. అలా సాయంత్రానికి రెడ్ కార్పెట్ పై మెరిశాను. ఆ తర్వాత మాత్రమే అంతా భోజనం చేశాం.”

ఇలా తన రెడ్ కార్పెట్ వెనక పడిన కష్టాన్ని పూజాహెగ్డే బయటపెట్టింది. కాన్స్ రెడ్ కార్పెట్ పై మెరుపుల క్రెడిట్ తనది కాదని, ఆ క్రెడిట్ పూర్తిగా తన మేకప్ ఆర్టిస్టు, టీమ్ మొత్తానికి చెందుతుందని తెలిపింది పూజా.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే పవన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది. హరీశ్ శంకర్ సినిమాలో పవన్ సరసన పూజానే హీరోయిన్.

ALSO READ: రీమేక్ చేయడానికి రీజన్ చెప్పిన రాజశేఖర్